నగరాలకు జపాన్‌ హంగులు | - | Sakshi
Sakshi News home page

నగరాలకు జపాన్‌ హంగులు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

శివాజీనగర: పట్టణ–నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ నిర్వహణ రంగాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జపాన్‌ నమూనాలను అర్థం చేసుకుని, స్వీకరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ అన్నారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఒసాకాలోని మైషిమా వ్యర్థ దహన కేంద్రాన్ని సందర్శించారు. పట్టణాలు, నగరాల్లో పోగయ్యే చెత్తను ఇక్కడ ఎలా ఇంధన ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారో చూశారు. ఇటువంటి కేంద్రాలను అధ్యయనం చేయడం ద్వారా కర్ణాటక నగరాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయవచ్చని, శాసీ్త్రయ రీతిలో వ్యర్థాల తొలగింపును ప్రోత్సహించవచ్చని అన్నారు. ఇది వ్యర్థాల నుంచి విద్యుత్‌శక్తిని ఉత్పత్తి చేసే పరిష్కారాలకు, పరిశుభ్రమైన నగరాల నిర్మాణానికి సహాయపడుతుందని తెలిపారు. బెంగళూరుతో సహా నగరాల నుంచి పోగయ్యే చెత్త, వ్యర్థాలు నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు జపాన్‌ ‘వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి’ అనే నమూనాను అధ్యయనం చేస్తామని సీఎం చెప్పారు.

రైలు, రవాణా వ్యవస్థపై ఆరా

జపాన్‌లోని నగోయా నుంచి షింకన్షెన్‌ బుల్లెట్‌ రైలులో ఒసాకాకు సీఎం డీకే ప్రయాణించారు. ఒసాకా రైల్వేష్టేషన్‌లో జపాన్‌లో నివసిస్తున్న కన్నడిగులను, వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ముచ్చటించారు. జపాన్‌లో జీవితం ఎలా ఉందో తెలుసుకున్నారు. జపాన్‌ అద్భుతమైన రైలు నెట్‌వర్క్‌, రవాణా మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులతో సమాచారం అందుకున్నారు. ఇది కర్ణాటక పట్టణ రవాణా, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుదలకు సాయపడుతుందని అన్నారు.

స్థానిక అధికారితో వివరాలు తెలుసుకొంటున్న సీఎం

జపాన్‌లో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో సీఎం డీకే శివ

చెత్త నుంచి విద్యుదుత్పత్తి ఉత్తమం

సీఎం డీకే శివకుమార్‌

జపాన్‌లో 2వ రోజు పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement