పెళ్లి చేసుకోమంటే.. ప్రాణాలు తీశాడు | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోమంటే.. ప్రాణాలు తీశాడు

Nov 25 2026 3:36 AM | Updated on Nov 25 2026 3:36 AM

యశవంతపుర: ప్రేమించుకున్నాం, ఇక పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలిని లాడ్జి భవనంపై నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె ప్రియుడు సంతోష్‌ను బెంగళూరు గంగమ్మనగుడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 19న అబ్బిగెరె సర్కిల్‌లో ఓ లాడ్జి పైనుంచి పడడంతో హాసన్‌కు చెందిన ఐశ్వర్య (23) అనే యువతి చనిపోయింది. సాధారణ ఘటనగానే అందరూ భావించారు.

సంతోష్‌ ఘాతుకం..

ఆమె తల్లిదండ్రులు విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంతోష్‌, ఐశ్వర్య ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరేది. పెళ్లి ఇష్టం లేని సంతోష్‌ హత్యకు పథకం వేశాడు. ఆ రోజు లాడ్జికి తీసుకెళ్లి రూం తీసుకున్నాడు. రాత్రి 8 గంటలకు గొడవ జరిగింది. మూడో అంతస్తు నుంచి ఐశ్వర్య కరెంట్‌ స్తంభం మీద పడి, మళ్లీ రోడ్డుపై పడింది. తీవ్ర గాయాలైన ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయింది. సంతోష్‌ తోసివేసినట్లు తెలియడంతో అతన్ని అరెస్టు చేశారు.

ఎంతో చెప్పి చూశాం: తల్లి

అతనిని ప్రేమించవద్దని తాము కూతురికి పదేపదే చెప్పామని తల్లి విలపించింది. కానీ ఆమె ప్రైవేటు ఫోటోలు ఉన్నాయంటూ బెదిరించి తమ కూతురిని లోబర్చుకున్నాడని తెలిపింది. ఆమెకు వేరొకరితో పెళ్లి చేయరాదని సంతోష్‌ తరచూ తమ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసేవాడని పేర్కొంది. ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని, ఆస్పత్రికి వెళ్లేసరికి కుమార్తె చనిపోయిందని, సంతోష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.

లాడ్జి నుంచి పడి యువతి మృతి

ప్రియుడే తోసేసిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement