ఊరంతా జాతరలో బిజీ.. భార్యాభర్తలు ఇద్దరూ మద్యం తాగి.. చివరికి | - | Sakshi
Sakshi News home page

ఊరంతా జాతరలో బిజీ.. భార్యాభర్తలు ఇద్దరూ మద్యం తాగి.. చివరికి

May 30 2023 10:14 AM | Updated on May 30 2023 10:13 AM

- - Sakshi

యశవంతపుర: ఊరు ప్రజలంతా జాతరలో నిమగ్నమై సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు దంపతులు మద్యం తాగి గొడవ పడ్డారు. మాటామాటా పెరిగింది. ఆవేశం తాళలేక భార్య తన కుమారుడితో కలిసి భర్తపై ఇనుపరాడ్లతో దాడిచేయగా అతను మృతి చెందాడు. ఈ ఉదంతం బెళగావి జిల్లా మూడలగి తాలూకా హళ్లూరు గ్రామంలో జరిగింది.

హళ్లూరులో ద్యామవ్వ, మహాలక్ష్మిదేవి జాతర 12 ఏళ్లకు ఒక పర్యాయం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. గ్రామానికి చెందిన చంద్రకాంత మావరకర్‌(42), సావిత్రి దంపతులు మద్యం తాగి సంబరాల్లో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య సావిత్రి తన కుమారుడు సునీల్‌తో కలిసి చంద్రకాంతపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడలగి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement