అత్యధిక మెజార్టీతో గెలిచాను.. నాకే మంత్రి పదవి ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అత్యధిక మెజార్టీతో గెలిచాను.. నాకే మంత్రి పదవి ఇవ్వాలి

May 19 2023 1:32 AM | Updated on May 19 2023 1:38 PM

- - Sakshi

కర్ణాటక: ఈసారి అత్యధిక మెజార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే గణేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కంప్లి బ్లాక్‌ యూత్‌ కాంగ్రెస్‌ సమితి అధ్యక్షులు ఆర్‌పీ శశికుమార్‌ మనవి చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కూడా రూ.కోట్లాది నిధులు తెచ్చి క్షేత్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారన్నారు.

మస్కి అసెంబ్లీ క్షేత్ర ఉప ఎన్నికల్లో ఇన్‌చార్జిగా ఉండి అక్కడి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారన్నారు. అందువల్ల సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే.శివకుమార్‌ ఎమ్మెల్యే గణేష్‌కు అమాత్య పదవి కట్టబెట్టాలన్నారు. ఉపాధ్యక్షులు రాజాబక్షి, కోటెహాల్‌ వీరేష్‌, శాంతి, ప్రధాన కార్యదర్శి లేబల్‌ వీరేష్‌, కార్యదర్శి, సభ్యులు గోపినాథ్‌, రాము, మారుతి, చేతన్‌, యల్లప్ప, బాష, ఫయాజ్‌, ఫారూక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement