నిఖిల్‌.. ఓటు అడగవద్దు | - | Sakshi
Sakshi News home page

మీ నాన్నను, మీ అమ్మను ఎమ్మెల్యేలుగా గెలిపించాం...

Apr 11 2023 7:27 AM | Updated on Apr 11 2023 7:45 AM

నిఖిల్‌ను ప్రశ్నిస్తున్న మహిళలు   - Sakshi

నిఖిల్‌ను ప్రశ్నిస్తున్న మహిళలు

దయచేసి మా ఏరియాకు వచ్చి ఓట్లు అడక్కండి.

కర్ణాటక: దయచేసి మా ఏరియాకు వచ్చి ఓట్లు అడక్కండి. మీ నాన్నను, మీ అమ్మను ఎమ్మెల్యేలుగా గెలిపించాం.ఇప్పటికీ మాకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. మీకు ఓట్లు వెయ్యం, మీకే కాదు ఎవ్వరికీ వెయ్యం అంటూ ఓ మహిళ నిఖిల్‌ కుమారస్వామికి ఘాటుగా చెప్పింది. రామనగర జేడీఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిఖిల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనగరలోని ఒక మురికివాడకు వెళ్లగా అక్కడి మహిళలు నిఖిల్‌ను నిలదీశారు.

గతంలో కుమారస్వామి, అనితలను రామనగర ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. వారు పలుసార్లు వచ్చి అభివృద్ధి పనులకు భూమిపూజలు చేసివెళ్లారు కానీ పనులు మాత్రం జరగలేదు. ఆ కోపంతో నిఖిల్‌పై మండిపడ్డారు. దీంతో కంగుతిన్న నిఖిల్‌ చివరికి వారికి నచ్చచెప్పి ఓటేయాలని అడిగారు.

Advertisement
 
Advertisement
Advertisement