కరీంనగర్‌క్రైం: తెలంగాణవ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమాఖ్య ప్రతినిధుల సమావేశంలో సమాఖ్య అధ్యక్షులుగా రంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది విప్లవరెడ్డిని ఎన్నుకున్నారు. సంయుక్త కార్యదర్శులుగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చండ్రపాటి కిరణ్‌కుమార్, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. మొదటిసారిగా స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్‌లో 3 పదవులు కరీంనగర్‌కు దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన
కరీంనగర్: హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్‌ను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని తెలంగాణచౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకావడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. దిష్టిబొమ్మలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర పెనుగులాట జరిగి ఉద్రి క్త వాతావరణం నెలకొంది. సుమారు గంటపాటు సాగిన ఈ ఆందోళనతో నలువైపులా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సుమారు 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.సునీల్‌రా వు, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు మాడ వెంకట్ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్ రావు, గణపతి, దుర్శెట్టి సంపత్, ఎర్రబెల్లి సంపత్ రావు, గాజుల స్వప్న, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేష్, గుంజెటి శివ, కటకం లోకేష్, నిర్మల, బొంతల కళ్యాణ్ చంద్ర తదతరులు పాల్గొన్నారు.
షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రవిచంద్ర
కరీంనగర్‌కల్చరల్: తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు, నంది అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిలు రమేశ్ వెల్లడించారు. ఇప్పటికే గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆసంపల్లి శ్రీనివాస్‌తో పాటు పొన్నం రవిచంద్ర కూడా ఈ బాధ్యతల్లో కొనసాగనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ముఖ్య సలహాదారుగా ఐఏఎస్ అధికారి జీవీ శ్యాంప్రసాద్‌లాల్ నియమితులయ్యారు.


