గణేశ్‌నగర్ బైపాస్ నుంచి దిగువకు ఉన్న అంతర్గత రహదారి
ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా? అన్నట్లుగా ఉంది గణేష్‌నగర్‌లోని బాలాజీనగర్ రోడ్డు పరిస్థితి. బైపాస్ నుంచి కాలనీలోకి వెళ్లే మలుపు వద్ద భారీ గొయ్యి వాహనదారులను భయపెడుతోంది. రోడ్డు ఎత్తులో వ్యత్యాసం, మలుపు వద్ద తగినంత వెడల్పు లేకపోవడంతో ఏమరుపాటుగా వాహనం మళ్లిస్తే గొయ్యిలో పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రివేళల్లో పరిస్థితి
మరింత ప్రమాదకరంగా మారుతోంది. బాలాజీనగర్, తిరుమల్‌నగర్ వాసులు నిత్యం ఇదే
మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చి, మలుపును సురక్షితంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
–కరీంనగర్ కార్పొరేషన్


