● ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి
కరీంనగర్‌సిటీ: శాతవాహన యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వుతూ బొందల గడ్డగా మార్చుతారా అని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆవరణలో అక్రమ తవ్వకాలు, చెట్ల నరికివేత ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీలోని పచ్చని చెట్లను నరికి ప్రకృతి విధ్వంసం చేశారని, యూనివర్సిటీలో ఉండే వన్యప్రాణులు కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్విన మట్టి, కొట్టిన చెట్లకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. మట్టిని ఎక్కడికి పంపించారు.. ఎందుకోసం పంపించారు.. చెట్లను ఎవరికి అప్పగించారు అనే దానిపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నూనావత్ శ్రీనివాస్‌నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సందీప్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు వరుణ్ శివాజీ, నాయకులు యశ్వంత్, కుమార్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


