న్యూస్‌రీల్
ఓం.. శివోహం
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా జిల్లాలోని శివకేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని పాతబజార్‌లోని గౌరీశంకర ఆలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాతబజార్ శివాలయంలో వివిధ ఆకృతుల్లో దీపాలు, ఆకాశదీపాన్ని వెలిగించారు. కమాన్‌రోడ్‌లోని రామేశ్వరాలయంలో స్వామివారిని సుందరంగా అలంకరించారు. రామడుగు మండలం వెదిరలోని శ్రీ వేంకటేశ్వర, శ్రీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో సహస్ర దీపోత్సవం వైభవంగా నిర్వహించారు.
–కరీంనగర్ కల్చరల్/రామడుగు


