కరీంనగర్ కార్పొరేషన్: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేలా కృషి చేస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నగరపాలకసంస్థకు సంబంధించిన లబ్ధిదా రులకు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, ఏఎంసీ చైర్మ న్ ఆకుల నర్సయ్యతో కలిసి ప్రొసీడింగ్స్ అందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలకసంస్థ పరిధిలో 3,812 మందికి పింఛన్ మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం డివిజన్‌కు ఐదుగురు చొప్పున ప్రొసీడింగ్స్ ఇచ్చామని, మంగళ, బుధవారాల్లో మిగతా వారికి కౌంటర్లు ఏర్పాటు చేసి అందిస్తామని కమిషనర్ తెలి పారు. అనర్హులుగా ప్రకటించిన వారిలోనూ అర్హులు ఉన్నారని, మరోసారి వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయాలని డిప్యూటీ మేయర్ సునీల్‌రావు కోరారు. కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, చాడగొండ బుచ్చిరెడ్డి, సోమిడి వేణుప్రసాద్, మాసం గణేశ్, గంట శ్రీనివాస్ పాల్గొన్నారు.
లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవాల్సిందే..
తిమ్మాపూర్: లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి లిడ్ క్యాప్ భూములను దారాదత్తం కాకుండా కాపాడాలని వినతిపత్రం అందించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని అత్యంత విలువైన లిడ్ క్యాప్ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన, మాదిగ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఉందన్నారు. లిడ్ క్యాప్ అంటే చర్మ వృత్తిపై ఆధారపడిన మాది గల ఆస్తులని, ఈ భూములు కులవృత్తుల అభివృద్ధికే ఉపయోగపడాలన్నారు. స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లిడ్ క్యాప్ భూములను దారాదత్తం చేయవద్దనే వినతిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, యూనిటీ మాల్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నవీన్, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, బోయిని కొమురయ్య, దండు వరలక్ష్మి, మేకల సునిల్, దండు అంజయ్య, తాటిపెల్లి సంపత్ పాల్గొన్నారు.
ఖేలో ఇండియా గేమ్స్ ఘనంగా నిర్వహించాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చూడాలని క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుంచి కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకు జిల్లాలకు రూ.5లక్షలు విడుదల చేశామని, మరో 15 రోజుల్లో అదనంగా రూ.5 లక్షలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ అభివృద్ధి పనుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలోని శ్రద్ధ ఇన్ హోటల్, ఎన్‌టిఆర్ విగ్రహం, డీమార్ట్, బైపాస్, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఐటీ హబ్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.గౌతమ్‌నగర్ ఫీడర్ పరిధిలోని పీజీ కళాశాల, మహాలక్ష్మీనగర్, శ్రీనివాస్‌నగర్, వినాయకనగర్, ప్రొఫెసర్ జయశంకర్ కాలనీ, విజేతసిరి నిలయం, కట్టరాంపూర్, రెడ్డికాలనీ, శ్రేయం అపార్ట్‌మెంట్, తిరుమలనగర్ పాంతాలతో పాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.సీతారాంపూర్ ఫీడర్ పరిధిలోని సాలెహ్‌నగర్, హనుమాన్‌నగర్, ద్వారకానగర్, రేకుర్తి చౌరస్తా, శుభం గార్డెన్, రిలయన్స్ మాల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2, కరీంనగర్ రూరల్ ఏడీఈలు ఎం.లావణ్య, గాదం రఘు తెలిపారు.


