వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలి

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

కరీంనగర్‌ సిటీ: జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డిని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయంలో నూతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా విద్యార్థుల భవిష్యత్తును, ఉన్నత విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయంలో పరిశోధనా వసతులు మెరుగుపడితే స్థానిక విద్యార్థులకు, యువతకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement