ఒకప్పుడు ఇంటి వెనుక, పొలాల్లోని గడ్డివామును లక్ష్యంగా చేసుకుని బాణాలు సంధించింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తోంది. ఆమే చికిత. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు ఆమె ప్రస్తానం ప్రారంభించినప్పుడు సౌకర్యాలు లేవు. ప్రత్యేక శిక్షణా కేంద్రం లేదు. ఖరీదైన పరికరాలు కొనుగోలు చేయలేదు. కూతురి కలను నెరవేర్చేందుకు తండ్రి తన శక్తిమేర అండగా నిలిచాడు. ఆ నమ్మకానికి చికిత తన బాణాలతో సమాధానం చెబుతూ వచ్చింది. కెనడాలో ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణాన్ని దాటి ఇప్పుడు ఆసియా క్రీడల స్వర్ణ శిఖరాన్ని చేరింది. – వివరాలు 8లో..


