రెండున్నరేళ్లలో విద్యుత్‌ వసతులు బలోపేతం | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లలో విద్యుత్‌ వసతులు బలోపేతం

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

● కరీంనగర్‌ ఎస్‌ఈ విజేందర్‌ రెడ్డి

● కరీంనగర్‌ ఎస్‌ఈ విజేందర్‌ రెడ్డి

కొత్తపల్లి(కరీంనగర్‌): వినియోగదారులకు నిరంతరం, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కరీంనగర్‌ విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో రెండున్నరేళ్లుగా విస్తృతంగా అభివృద్ధి చేపట్టినట్లు ఎస్‌ఈ ఏ.విజయేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 12 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు, 7 అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు, 692 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపు, 548 అదనపు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌ అవసరాలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆరు కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ సబ్‌స్టేషన్లలో 109 కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటు చేశామన్నారు.

విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్‌టౌన్‌: జిల్లాలోని 22 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు మాక్‌ పార్లమెంట్‌, స్పెల్‌–బీ, క్విజ్‌ పోటీలను జిల్లా సైన్స్‌ మ్యూజియంలో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సాధారణ జ్ఞానం, భాషా నైపుణ్యాలు, తార్కిక ఆలోచన, పోటీ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. మాక్‌ పార్లమెంట్‌లో ప్రథమ బహుమతి అలేఖ్య (టీజీఎంఎస్‌ గంగాధర), ద్వితీయ బహుమతి ఎం.చైత్రిక (టీజీఎంఎస్‌ శంకరపట్నం), తృతీయ బహుమతి వై.తేజస్విక (టీజీఎంఎస్‌ మానకొండూరు), నాలుగో బహుమతి ఎస్‌.సంజన (టీజీఎంఎస్‌ ఎలగందల్‌), ఐదో బహుమతి ఆర్‌.హారిక (జెడ్పీహెచ్‌ఎస్‌ చెల్పూర్‌) సాధించారు. స్పెల్‌–బీ పోటీల్లో ఎం.మహతి (స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, తిమ్మాపూర్‌), పి.శివాంజలి (టీజీఎంఎస్‌ గంగాధర), ఈ.నిహారిక (జెడ్పీహెచ్‌ఎస్‌ దుర్శేడు) విజేతలుగా నిలిచారు. క్విజ్‌లో శ్రేష్ట, సిరిచందన, రిషితారాజ్‌ (సీవోఈ అలుగునూరు) మొదటి మూడు స్థానాలు సాధించారు. జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రశాంత్‌రెడ్డి, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి కర్ర అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి జైపాల్‌రెడ్డి, రిసోర్స్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు.

జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌గా సుబ్బలక్ష్మి

కరీంనగర్‌క్రైౖం: జిల్లా ఆడిట్‌ రిజిస్ట్రార్‌గా వి.సుబ్బలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర ఆడిట్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించిన సుబ్బలక్ష్మిని కరీంనగర్‌ ఆడిట్‌ విభాగం జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. కరీంనగర్‌లో ప్రొహిబిషనరీ జిల్లా రిజిస్ట్రార్‌ (పీడీఆర్‌)గా విధులు నిర్వహిస్తున్న శాగుఫ్తా ఫిర్దోస్‌ను వరంగల్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా బదిలీలతో కరీంనగర్‌ రిజిస్ట్రేషన్‌శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement