న్యూస్‌రీల్
భీమన్నకు మొక్కులు
వేములవాడ: భీమన్నను ఆదివారం 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషే కాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కల్యాణం మొక్కులు చెల్లించుకున్నారు.
బద్దిపోచమ్మకు బోనం
వేములవాడ: భక్తులు బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు నైవేద్యం వండి బద్దిపోచమ్మకు బోనం తీశారు.
సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్ రావుకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆయన వర్గం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది. పేరుకు తాను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ.. పదవుల కేటాయింపులో తన మాటలు, అభిప్రాయాలు, సూచనలకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన వర్గంలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో నగరంలోని 66 డివిజన్ ఇన్‌చార్జుల నియామయంలో వెలిచాల మాటను అధిష్టానం పట్టించుకోలేదు. అయినా, ఆ సమయంలో వెలిచాల వర్గం మౌనంగానే ఉండిపోయింది. 66 డివిజన్లలో టికెట్ల కేటాయింపులోనూ పూర్తిస్థాయిలో తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని వెలిచాల వర్గం బహిరంగంగానే అసంతప్తి వ్యక్తంచేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో సీట్లు గెలవలేకపోయింది. ఫలితంగా బీజేపీ మేయర్ సీటు కై వసం చేసుకుంది.
త్వరలో సీఎంకు ఫిర్యాదు
తాజాగా నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలకు అధ్యక్షుల కేటాయింపు విషయం తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా వెలిచాల కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు తన అనుచరుల్లో ఇద్దరిని ఎంపిక చేసి, వారి పేర్లు అధిష్టానానికి పంపారు. వెలిచాల సూచించిన పేర్ల కాకుండా, ఇతరులు సూచించిన పేర్లు ఖరారవుతున్నట్లుగా సమాచారం అందడంతో వెలిచాల వర్గం మరింత నైరాశ్యంలోకి జారిపోయింది. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనూ ఆఖరి నిమిషంలో టికెట్ ఇచ్చినా.. రెండో స్థానంలో నిలిచి విశేషస్థాయిలో ఓట్లు తెచ్చానని, తరువాత కూడా పార్టీ కార్యకలాపాలకు ఆర్థికంగా అండదండలు అందిస్తున్నా.. తన మాట చెల్లుబాటు కాకపోవడం ఏంటని వెలిచాల రాజేందర్ రావు విస్తుపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి 11 మంది సర్పంచులు గెలిపించుకున్నానని గుర్తు చేస్తున్నారు. తాను ఇన్‌చార్జిగా ఉన్న నియోజకవర్గంలో ఇతరుల పెత్తనంపై తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక తనకు ఈ పదవి ఇచ్చి లాభం ఏంటని వాపోతున్నారు. ఈ విషయంపై సీఎం సన్నిహితుల వద్ద వెలిచాల తన ఆవేదన వ్యక్తం చేసినా పరిస్థితుల్లో మార్పు కనిపించలేదని, అందుకే ఈ నెల 30న కరీంనగర్‌కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గంలో పార్టీ పరంగా తనకు ఎదురవుతున్న ప్రతికూలతలను వివరించేందుకు యత్నిస్తున్నారని తెలిసింది.


