కరీంనగర్/కరీంనగర్ రూరల్: జిల్లాలో సీజన ల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలు బు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రతిరోజూ 1,000 నుంచి 1,300మంది వరకు ఓపీకి వస్తుండగా.. వీరిలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వాస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రోగుల రద్దీ కనిపిస్తోంది.
చిన్నారులే ఎక్కువ
ప్రస్తుత సీజన్‌లో చిన్నారులే ఎక్కువగా వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే తమ సూచన మేరకే మందులు వాడాలని వైద్యులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు ఉంటే శరీరంలో నీరు, లవణాలు తగ్గకుండా ఓఆర్‌ఎస్ ఇవ్వాలని సూచిస్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉండటం, నిరంతర వాంతులు, శ్వాస ఇబ్బంది, మూ త్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పేర్కొంటున్నారు.
పడేసిన పల్లెలు
గ్రామాల్లోనూ జ్వర బాధితులు పెరుగుతున్నారు. జ్వరంతోపాటు ఒళ్లునొప్పులు, దగ్గు,జలుబు లక్షణాలతో బాధపడుతున్నారు. చిన్నారులు, మహిళలు ఎక్కువగా జ్వరాల బారినపడుతున్నారు. చికిత్స కోసం వస్తున్న రోగులతో సబ్‌సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు పీహెచ్‌సీల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ రూరల్ పరిధి లోని తాహెర్‌కొండాపూర్‌లో జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని సర్పంచు ఆకుల గిరి సమాచారం ఇవ్వడంతో వైద్యశిబిరం నిర్వహించారు. చామనపల్లి, చెర్లభూత్కూర్, దుర్శేడ్, గోపాల్‌పూర్, చామనపల్లి, నగునూరు సబ్‌సెంటర్లలోనూ జ్వరబాధితులకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ మనోహర్ తెలిపారు. పదిరోజుల నుంచి పీహెచ్‌సీల్లో ఓపీ పెరిగిందని వివరించారు.


