ప్రత్యక్ష సందర్శనతోనే చరిత్రపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష సందర్శనతోనే చరిత్రపై అవగాహన

Sep 28 2026 1:35 AM | Updated on Sep 28 2026 1:35 AM

కరీంనగర్‌ కల్చరల్‌: చారిత్రక ప్రదేశాలను ప్ర త్యక్షంగా సందర్శించినప్పుడే వాటి చరిత్ర, సంస్కృతి, అప్పటి ప్రజల జీవన విధానం మరింత స్పష్టంగా అర్థమవుతుందని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన 2కే రన్‌, తెలంగాణ దర్శిని కార్యక్రమాలను డీఎఫ్‌వో సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. క్రీడా పాఠశాల విద్యార్థులు డీర్‌పార్క్‌, పురావస్తు మ్యూజియం సందర్శించారు. పర్యాటక అధికారి శ్రీనివాస్‌, స్కైలైన్‌ గోపి, శ్రీవాస్తవ, స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

అర్బన్‌ బ్యాంకు సమావేశం

కరీంనగర్‌ అర్బన్‌: అర్బన్‌ బ్యాంకు నిర్వహణకు ఎజెండా ఆమోదం తీసుకోవడం జరిగిందని కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంక్‌ పీఐసీ చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో అర్బన్‌ బ్యాంక్‌ పీఐసీ చైర్మన్‌ విలాస్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 13న సమావేశం కోరం లేక నిర్వహించలేకపోయామన్నారు. సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో ఎజెండా అమలు కానుందన్నారు. మడుపు మోహన్‌, ముక్క భాస్కర్‌, ముద్దసాని క్రాంతి, మూల లక్ష్మి, లక్ష్మణరాజు, విద్యాసాగర్‌, సందీప్‌, షాముద్దీన్‌, రవీందర్‌, సతీశ్‌, రాజు, బ్యాంక్‌ సీఈవో నునుగొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

బకాయిల సాధనకు పోరు

కరీంనగర్‌ టౌన్‌: రిటైర్డ్‌ ఉద్యోగుల పెండింగ్‌ బకాయిల సాధనకు సంఘటితంగా ఉద్యమించాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. సంఘం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తొలి వార్షికోత్సవ సమావేశాన్ని ఆదివారం కరీంనగర్‌లోని ఫిల్మ్‌ భవన్‌లో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశేల ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి, ‘రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌– తెలంగాణ’గా నామకరణం చేసి రిజిస్ట్రేషన్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఆర్థిక కార్యదర్శి కనపర్తి దివాకర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నరహరి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో సోమవారం ఉదయం 9 నుంచి 12గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్‌ పరిధిలోని కోర్టు చౌరస్తా, వన్‌ హాస్పిటల్‌, పాత డీఐజీ బంగ్లా, ఐబీ చౌరస్తా, సర్కస్‌ మైదానం, పద్మనాయక కల్యాణమండపం ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 11 కె.వీ.శివనగర్‌, గీతాభవన్‌, రాంనగర్‌ ఫీడర్ల పరిధిలోని సప్తగిరికాలనీ, శివనగర్‌, టెలిఫోన్‌ క్వార్టర్స్‌, ప్రగతినగర్‌, హస్నాపూర్‌కాలనీ, రాంనగర్‌, మంకమ్మతోట, పద్మనగర్‌, చేపల మార్కెట్‌, సత్యనారాయణ స్వా మి ఆలయం, సిద్ధార్థ స్కూల్‌, వాసరా హాస్పిటల్‌, రాజీవ్‌ పార్కు, మార్క్‌ఫెడ్‌, లేబర్‌ అడ్డ ప్రాంతాలతో పాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.గంజ్‌, డీఎఫ్‌ఓ ఫీడర్ల పరిధిలోని అన్నపూర్ణ కాంప్లెక్స్‌, సిఖ్‌వాడ, బోయవాడ, మార్కెట్‌, గంజ్‌, అజ్మత్‌పుర, ఉస్మాన్‌పుర, సవరన్‌ స్ట్రీట్‌. శ్రీదేవి హాస్పిటల్‌, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 2, 1 ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

ఉల్లాస్‌ పరీక్షకు 13,177 మంది హాజరు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఉల్లాస్‌ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 13,177 మంది హాజరయ్యారని మెప్మా పీడీ స్వరూపరాణి తెలిపారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పట్టణాల్లో స్వశక్తి సభ్యులకు 81 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి, 14,459 మంది అభ్యాసకులను పరీక్షకు హాజరయ్యేలా లక్ష్యంగా నిర్దేశించారు. వారిలో 13,177 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,282 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 91.13 శాతం హాజరు నమోదైనట్లు స్వరూపరాణి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement