రసాయన ఎరువుల ధరలు రెండింతలయ్యాయి. మళ్లీ ఎరువుల ధరలు పెరిగితే వ్యవసాయం చేయడం ఇక కష్టమే. ప్రభుత్వం రైతు శ్రేయస్సు దృష్ట్యా సబ్సిడీని ఎప్పటి మాదిరిగానే ఎరువులకు వర్తింపజేయాలి.
– బందెల మల్లయ్య, చల్‌గల్
ధరలు పెరిగే అవకాశముంది
రసాయన ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల ధరలు యుద్ధంతో పెరుగుతుండడంతోపాటు రష్యా, చైనా లాంటి దేశాలు ఎగుమతులను పూర్తిగా నిలిపేశాయి. సల్ఫర్‌కు డిమాండ్ ఏర్పడి ఎస్‌ఎస్‌పీ రేట్లు కొంతమేర పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.
– అయిండ్ల రాజిరెడ్డి,
ఫర్టిలైజర్ వ్యాపారి, జగిత్యాల


