‘అంతర్గాం’లో ఆలస్యమెందుకు? | - | Sakshi
Sakshi News home page

‘అంతర్గాం’లో ఆలస్యమెందుకు?

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

రామగుండం: ‘ఉడాన్‌’ కింద రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతీ ఎయిర్‌పోర్ట్‌ స్థాపనను పనులు ప్రారంభించిన 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 21 రాష్ట్రాల్లో పరస్పర ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్‌, కొత్తగూడెం, మామునూర్‌(వరంగల్‌) మాదిరిగానే అంతర్గాంలోనూ ఉడాన్‌లో భాగంగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే, అంతర్గాం మినహా మిగతావాటి అభివృద్ధి పనులు ప్రారంభం కావడం, నిధులను కేటాయించడం, ప్రత్యేకాధికారుల నియామకం ప్రక్రియ పూర్తి కావడం పూర్తయ్యాయి. అయినా అంతర్గాం విషయంలో ముందడుగు పడలేదు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గతేడాది నవంబర్‌లో..

గతేడాది నవంబర్‌లో అంతర్గాం, బసంత్‌నగర్‌లో భూ సర్వే, ఇతరత్రా సాంకేతిక అంశాలపై ప్రీ ఫిజిబిలిటీ అధ్యయన నివేదిక తయారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షల ఫీజును ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అందజేసింది. డిసెంబర్‌ మొదటివారంలో ఏఏఐ ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాల ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. తొలుత బసంత్‌నగర్‌ ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించినా భౌగోళికంగా, సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలం కాకపోవడంతో అంతర్గాంలోని 591.24 ఎకరాల ప్రభుత్వ భూమిని వినియోగించుకోవచ్చని సూచిస్తూ ప్రభుత్వానికి నివేదించింది.

బహుళ అవసరాల వినియోగానికి నిర్ణయం?

అంతర్గాంలో నిర్మించే ఎయిర్‌పోర్ట్‌లో డొమెస్టిక్‌ విమానాలతోపాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) రక్షణ అవసరాలకు ఉపయోగపడేలా మరో 400 ఎకరాలు సేకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫలితంగా ఎయిర్‌బస్‌ ఏ320 వాణిజ్య, ప్యాసింజర్‌ విమానాలు ల్యాండ్‌ కావడానికి వీలవుతుండడంతో రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతో పాటు పారిశ్రామిక ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ భారీగా పెరగనుంది.

అనుమతుల ప్రక్రియపైనే జాప్యం

గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ పాలసీ ప్రకారం.. అంతర్గాం ప్రాజెక్టుకు ముందడుగు పడాలంటే సైట్‌ క్లియరెన్స్‌, రక్షణశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. తొలుత అంతర్గాంలో ఎయిర్‌పోర్ట్‌కే ప్రతిపాదించినా.. తర్వాత ద్వంద్వ అవసరాలకు ఉపయోగపడేలా ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. రామగుండంలో పర్యావరణ క్లియరెన్స్‌లు రావడం కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని తెలిసింది.

ఆరు నెలల క్రితమే ఫిజిబిలిటీ నివేదిక

ప్రభుత్వ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement