వేములవాడరూరల్: వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగు అనిల్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతిచెందాడు. అనిల్‌కుమార్ స్వగ్రామం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన అనిల్‌కుమార్ డ్రైవర్‌గా విధుల్లో చేరి స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా ఎది గారు. గత రెండేళ్లుగా వేములవాడ అగ్నిమాపక అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
అనారోగ్యం భరించలేక మహిళ ఆత్మహత్య
కరీంనగర్‌క్రైౖం: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. టూ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్ ఎస్‌ఐ కొడిముంజ శంకరయ్య భార్య లింగవ్వ(61) పదేళ్లుగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, అర్షమొలలతో బాధపడుతోంది. ఇటీవల గుండె పరీక్షలు చేయించుకోగా.. బ్లాకులున్నట్లు వైద్యులు నిర్ధారించి మందులు సూచించారు. అనారోగ్య సమస్యలతో ఆమె కొంతకాలంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం భర్త శంకరయ్య పాల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి లింగవ్వ ఇంట్లోని ఇనుప పైపునకు ఉరేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యులకు సమాచారమందించడంతోపాటు పోలీసులకు తెలిపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శంకరయ్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2న అథ్లెటిక్స్ పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న సిరిసిల్ల మినీ స్టేడియంలో నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. అండర్ 14, 16 బాల, బాలికలు పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన, 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వివరించారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్, పతకాలు అందజేయడంతోపాటు, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ జనన ధ్రువీకరణపత్రం, 10వ తరగతి సర్టిఫికెట్, తీసుకురావాలన్నారు. వివరాలకు 79014 64456లో సంప్రదించాలని కోరారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి శుక్రవారం 8వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి వరదకాలువ ద్వారా 9,450, మానేరు, మూలవాగుల నుంచి 2,300 క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 24.52 టీఎంసీలకు చేరింది.


