● ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలి ● కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్‌అర్బన్: ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి నూతన భవనాన్ని అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. భవనాన్ని సుందరంగా అలంకరించాలని, ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారుల పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించాలని ఆదేశించారు. సమావేశ మందిరంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఆర్వో స్వామి, ఆర్డీవో షర్మిల, ఏవో సుధాకర్ పాల్గొన్నారు.


