జీజీహెచ్‌లో వీల్‌చైర్ సేవలు ఎక్కడ
పేషెంట్ కేర్ సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు
రోగులను బంధువులే తరలిస్తున్న వైనం
కోల్ సిటీ (రామగుండం)/కరీంనగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ జనరల్ (జీజీహెచ్) ఆస్పత్రిలో నడవలేని రోగులకు వీల్‌చైర్ సేవలు సక్రమంగా అందక వారి బంధువులు అవస్థలు పడాల్సి వస్తోంది. గురువారం చికిత్స కోసం ఆస్పత్రికి వేర్వేరుగా చ్చిన ప్రవీణ్, రాజమ్మను ఆర్థో ఓపీ విభాగాలకు తరలించేందుకు పేషెంట్ కేర్ సిబ్బంది అందుబాటులో లేక కుటుంబ సభ్యులే వీల్‌చైర్‌లను తోసుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది.
ప్రత్యేక సిబ్బంది అందుబాటులో లేక.. తామే ఈ బాధ్యతను తీసుకోవాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. కాగా, కరీంనగర్ 500 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాలు విరిగిన రోగిని తీసుకువెళ్లేందుకు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగి తల్లిదండ్రులే వీల్‌చైర్‌పై కూర్చోబెట్టారు. ఒకరు కాలు పట్టుకుని, మరొకరు వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ వెళ్లడం కనిపించింది.


