కరీంనగర్‌క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పరస్పర సహకార పొదుపు పరపతి సొసైటీ నూతన కార్యాలయాన్ని జిల్లా జడ్జి ఎస్. శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ సొసైటీ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సొసైటీ ద్వారా న్యాయవాదులకు లభించే సేవలు దినదినాభివృద్ధి చెందాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ గడ్డం లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సీహెచ్.కిరణ్ కుమార్, కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శి బొడ్ల గీతారాణి, కోశాధికారి సుంకె దేవికిషన్, బోర్డ్ సభ్యులు ఎం.మదన్‌బాబు, బి.శివకుమార్, ఎం.అనురాధ, బి.స్వామి, భూమాచారి, కరుణశ్రీ, శాంతికుమార్ పాల్గొన్నారు.


