కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి మండలంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక(12)తో ఓ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. కరీంనగర్ కోర్టు అతనికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లికి చెందిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేధించాడు. దీంతో జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల మరోసారి జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదివే ఓ విద్యార్థి తల్లికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేయడంతో గత నెలలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.


