అప్పులబాధతో గీతకార్మికుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో గీతకార్మికుడి ఆత్మహత్య

Sep 24 2026 12:06 AM | Updated on Sep 24 2026 12:06 AM

కోనరావుపేట(వేములవాడ): అప్పుల బాధలు, ఇతర సమస్యలు భరించలేక ఓ గీతకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలకేంద్రానికి చెందిన లింగాపురం వెంకటి(60) గ్రామంలోనే గీతకార్మికునిగా పనిచేసుకుంటున్నాడు. వెంకటికి సంతానం లేదు. ఇల్లు కూడా లేకపోవడంతో తమ్ముడు నారాయణ ఇంట్లోనే ఉంటున్నాడు. అనారోగ్య సమస్యలతో అప్పు కావడంతో ఇబ్బందులు పడుతున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన వెంకటి శివంగాలపల్లిరోడ్డులోని డంపింగ్‌యార్డ్‌ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోంచి వెళ్లిన వెంకటి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. డంపింగ్‌యార్డ్‌ సమీపంలో గొర్లను మేపుతున్న కాపరికి ఫోన్‌రింగ్‌ వినబడి, పొదల్లోకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. కోనరావుపేట ఎస్సై రామ్మోహన్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement