క్రిటికల్‌ కేర్‌.. ఆపరేషన్లు రేర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రిటికల్‌ కేర్‌.. ఆపరేషన్లు రేర్‌

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన కుమార్‌(45) బస్సు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఎడమ కాలి రెండు వేళ్లు తొలగించాల్సి ఉండటంతో గాంధీ నుంచి ఇక్కడకు పంపించారు. 20 రోజుల క్రితం చేరిన కుమార్‌ను నాలుగు రోజుల క్రితం ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లి సర్జరీ చేయకుండానే వెనక్కి పంపించారు.

రామడుగు మండల పరిధిలోని షానగర్‌కు చెందిన సుగుణ(60) కాలు విరగడంతో 20రోజుల క్రితం జీజీహెచ్‌లోని క్రిటికల్‌కేర్‌లో చేరింది. ఐదు రోజుల క్రితం ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లినా.. సర్జరీ చేయకుండానే తిరిగి వార్డుకు తీసుకొచ్చారు. టీహెచ్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో రాకపోవడంతో ఇంప్లాంట్‌ రూ.70 వేలతో కొనుగోలు చేయాలని సూచించారు. అంత మొత్తం తమవద్ద లేవని చెప్పడంతో ఎంజీఎంకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement