కరీంనగర్ క్రైం: విద్యార్థులు, వయోవృద్ధులు, దివ్యాంగులకు అందుతున్న సేవలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్ బుధవారం కరీంనగర్‌లో తనిఖీలు నిర్వహించారు. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. వంటశాల, స్టోర్‌రూం, వసతి గదులు, మరుగుదొడ్లు, భోజన ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సేవలను పరిశీలించారు. వంటగది, మరుగుదొడ్ల అపరిశుభ్రతతో పాటు నాణ్యత లేని కూరగాయలు, ఆహార పదార్థాలను గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్ఖానగడ్డలోని ప్రభుత్వ వయోవృద్ధులు, దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించి, వసతి, భోజనం, పరిశుభ్రత, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు. డీఎల్‌ఎస్‌ఏ సభ్యులు, న్యాయవాదులు ఏ.కిరణ్‌కుమార్, పెరుక రంగయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలుగు తణ్మయి, ప్యానెల్ న్యాయవాది నజీమా సుల్తానా పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: ప్రతిష్టాత్మకమైన అర్బ న్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్)లో భాగంగా నగరంలో చేపట్టనున్న మూడు ప్రాజెక్ట్‌లకు యూసీఎఫ్ స్టేట్ స్టీరింగ్ కమిటీఆమోదం తెలి పింది. దీంతో రూ.840 కోట్లతో చేపట్టనున్న మూడు ప్రాజెక్ట్‌లకు మార్గం సుగమమైంది. బుధవారం హైదరాబాద్ నుంచి యూసీఎఫ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, డీటీసీపీ దేవేందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, అదనపు కమిషనర్ ఆయాజ్, ఎస్‌ఈ సంపత్ రావు, డీఈ దేవేందర్ రెడ్డి, ఏఈ సతీశ్, ఏసీపీ వేణు పాల్గొన్నారు. యూ సీఎఫ్ కింద ఎంపికై న నగరంలో చేపట్టనున్న మోడల్ రోడ్ల నిర్మాణం, స్టాం వాటర్ డ్రైన్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు, టెక్నికల్, డిజైన్లు, టెండర్, పనులు తది తర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడానికి అనుసరించాల్సిన భవిష్యత్తు ప్రక్రియలపై యూసీఎఫ్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
కరీంనగర్: 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిభిరానికి విశేష స్పదన లభించింది. బుధవారం స్థానిక రాంనగర్‌లోని ప్రభుత్వ ఆయుష్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ప్రజలకోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో 500కు పైగా ఆయుర్వేద, హోమియో, యునాని వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. వైద్యులు ఆయుర్వేద ఔషధమొక్కలు నాటారు. ఆయుష్ జిల్లా నిర్వహణ అధికారి శేఖర్, ఆయుర్వేద, యునాని సీనియర్ వైద్యాధికారులు జంగయ్య, షఫిక్ అహ్మద్, కరీంనగర్ జిల్లా ఆయుష్ డీపీఎం ప్రవీణ్ కుమార్, ఆయుర్వేద వైద్యులు నీరజ, వెంకటేశ్వర్లు హోమియో వైద్యురాలు సంధ్య, నేచురోపతి వైద్యురాలు రజిత, యునాని వైద్యులు అప్సానా పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): ఇంటర్ అడ్మిషన్స్ గడువును ఈనెల 26 వరకు 3 రోజుల పాటు పొడిగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాఽశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి అడ్మిషన్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.


