హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంకటి సులోచన(45) మృతి చెందింది. మండలంలోని చెల్పూరుకు చెందిన కొంకటి సులోచన– రమేశ్ దంపతులు బైక్‌పై పెద్దపాపయ్యపల్లి నుంచి చెల్పూర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. సులోచన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రమేశ్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సులోచన చెల్పూర్ సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. సురేశ్ బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


