రుద్రంగి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన మోతె నితిన్ మంగళవారం మండల వాట్సాప్ గ్రూపులో రామకృష్ణ అనే కానిస్టేబుల్‌కు పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి ఓపెన్ చాలెంజ్ చేస్తూ వాయిస్ రికార్డు పోస్టు చేశాడు. బుధవారం జరిగే వినాయక నిమజ్జనంలో లా ఆండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తానని, పోలీస్ కానీ, ఆర్మీ కానీ వచ్చినా కంట్రోల్ కాకుండా చేస్తానని, తనతో గొడవ పెట్టుకున్నవారిని చంపుతానని లేదా తాను అయినా చస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన రుద్రంగి ఎస్సై మోతీరాంనాయక్ విచారణ చేపట్టి.. బుధవారం మోతె నితిన్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. చందుర్తి సీఐ రవీందర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం, ఇతర పండుగల సమయంలో ప్రజలందరూ భక్తితోపాటు సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


