బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 23 2026 12:37 AM | Updated on Sep 23 2026 12:37 AM

బుధవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 రూట్‌మ్యాప్‌ ఇలా..

న్యూస్‌రీల్‌

చింతకుంట కెనాల్‌ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు

నిమజ్జనానికి సిద్ధమైన కొత్తపల్లి చెరువు

మానకొండూర్‌ చెరువులో పూడికతీత పనులు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: గణేశ్‌ నిమజ్జనానికి నగరపాలకసంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. ఆరు పాయింట్ల ల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందు కు 11 క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. బుధ, గురువారాలు నిమజ్జనం పూర్తయ్యేంత వరకు పాయింట్ల వారిగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డీసీపీ బషీర్‌, డీఈ దేవేందర్‌కు మానకొండూర్‌ బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఏసీపీ శ్రీధర్‌, డీఈ వెంకటేశ్వర్లుకు కొత్తపల్లి, డిప్యూటీ కమిషనర్‌ ఖాదర్‌ మొహియొద్దిన్‌, ఏసీపీ వేణు, డీఈ శ్రీనివాస్‌ చింతకుంటలో పర్యవేక్షించనున్నారు. బొమ్మకల్‌, దుర్శేడ్‌లో అదనపు కమిషనర్‌ సువార్త, ఈఈ లచ్చిరెడ్డి విధుల్లో ఉంటారు. ఎస్‌ఈ సంపత్‌రావు, ఏసీపీ వేణు, డీఈ ఓం ప్రకాశ్‌కు టవర్‌సర్కిల్‌, అదనపు కమిషనర్‌ రాజమనోహర్‌, శానిటరీ సూపర్‌ వైజర్‌ శ్యాంరాజ్‌, ఏంహెచ్‌వో సుమన్‌కు పారిశుధ్య బాధ్యతలు అప్పగించారు.

ఆరు నిమజ్జన పాయింట్లు

నగరపాలక సంస్థతో పాటు కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, మానకొండూరు మండలాల నుంచి దాదాపు రెండు వేలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం మానకొండూరు, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్‌తో పాటు, బొమ్మకల్‌ చెరువు, దుర్శేడ్‌ వాగు, గోపాల్‌పూర్‌ చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. ప్రతి నిమజ్జనం పాయింట్‌ వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేశారు. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 11 క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. టవర్‌సర్కిల్‌, కమాన్‌చౌరస్తా, రాంనగర్‌ వద్ద శోభాయాత్ర స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. టవర్‌సర్కిల్‌తో పాటు కూడళ్లు, పాయింట్ల వద్ద లైటింగ్‌, పూలతో అలంకరించారు. ఈ సారి నిమజ్జన ఏర్పాట్లకు బల్దియా రూ.1.50 కోట్లు కేటాయించింది. నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని మేయర్‌కొలగాని శ్రీనివాస్‌ సూచించారు. మంగళవారం నిమజ్జన పాయింట్లను, టవర్‌సర్కిల్‌ సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు.

● మానకొండూరు చెరువుకు వెళ్లే వాహనాలు హైదరాబాద్‌ రోడ్డులోని కరీంనగర్‌ వంతెన, అలుగునూర్‌ మీదుగా మానకొండూరు చెరువుకు చేరుకోవాలి. నిమజ్జనం తరువాత సదాశివపల్లి జంక్షన్‌ నుంచి కేబుల్‌ వంతెన మీదుగా నగరంలోకి రావాలి.

● కొత్తపల్లి చెరువులో భారీ విగ్రహాలు కొత్తగా ఏర్పాటు చేసిన పాయింట్‌ వద్ద నిమజ్జనం చేయాలి. అనంతరం కొత్తపల్లి వంతెన మీదుగా మల్కాపూర్‌ వెళ్లాలి. చిన్న విగ్రహాలను పాత పాయింట్‌ వద్ద నిమజ్జనం చేయాలి.

● చింతకుంట కెనాల్‌ వద్ద భారీ విగ్రహాలను క్రేన్ల సాయంతో నిమజ్జనం చేసిన అనంతరం వాహనాలు చింతకుంట గ్రామం లోపలి నుంచి తిరిగి వెళ్లాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement