కల్తీ.. ఆరోగ్యం గల్తీ! | - | Sakshi
Sakshi News home page

కల్తీ.. ఆరోగ్యం గల్తీ!

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

తినుబండరాలు, పాలపదార్థాలు అంతటా కల్తీయే

వంటింట్లో వాడే మసాలాలు, పసుపు, కారం అంతే

పాలు, ఐస్‌క్రీం, స్వీట్లు, నూనె, నెయ్యి నాసిరకమే

కల్తీయా కాల్‌ చేయండి: 7032087727, 94404893871

ప్రాణాలకే ప్రమాదం

ఇది బావుపేటలోని ఆహార సంస్థ. కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలోని పలు స్వీట్‌షాపులు, బేకరీలకు ఆహార వస్తువులు సరఫరా చేస్తారు. పాలతో తయారు చేయాల్సిన స్వీట్లను మైదాతో తయారు చేస్తున్నారు. మైసూర్‌ పాక్‌ కూడా అంతేనని అధికారుల తనిఖీల్లోనూ వెల్లడైంది.

కమాన్‌ సమీపంలో చిప్స్‌ తయారు చేసే కేంద్రమిది. నాసిరకం అలుగడ్డలను, పురుగు పట్టిన వాటితో చిప్స్‌ తయారు చేస్తున్నారు. వివిధ రకాల రంగులు వాడి రసాయనాలను వినియోగిస్తున్నారు.

కరీంనగర్‌ అర్బన్‌: కల్తీ, కాలం చెల్లిన వస్తువులు ఆహార తయారీని శాసిస్తున్నాయి. ఆహార భద్రత శాఖ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నా జంకు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నోటీసులు, జరిమానాలకే పరిమితమవడమే అందుకు కారణమన్న వాదన వినిపిస్తుండగా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే పరిష్కారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాలం చెల్లిన మసాలాలు, సాస్‌లు వినియోగిస్తుండగా 20నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను డీప్‌ ఫ్రిజ్‌లో నిల్వ చేసి మరుసటి రోజు భోజనప్రియులకు అందిస్తున్న హోటళ్లకు కొదువ లేదు.

నీళ్ల నుంచి నూనె దాకా..

పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యత పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సి ఉండగా బయట రేటు కన్నా రెండు మూడింతల ఎక్కువ ధరకు క్వాలిటీ లేని వాటర్‌ బాటిళ్లను అంటగడుతున్నారు. నూనెలను ఒకట్రెండు సార్లు వాడాక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనె వాడుతున్నట్లు సమాచారం. మసాలాలు, పసుపు, కారం, పాలు, ఐస్‌క్రీం, స్వీట్లు, నూనె, నెయ్యి అన్ని కల్తీయే. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే మార్గాలకే మొగ్గు చూపుతున్నారు.

మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ వాహనమేదీ

ఆయిల్‌ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్‌ సెంట ర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, కూల్‌డ్రింక్‌ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యవసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక బృందం మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేదు.

కల్తీ ఫుడ్‌ తింటే ఆరోగ్యసమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కలరింగ్‌ ఏజెంట్లు, క్లాస్‌ 2 ప్రిజర్వేటివ్వాడకం వల్ల కేన్సర్‌ వచ్చే ప్రమాదముంది. పేగు, ప్యాంక్రియాటిక్‌ కేన్సర్ల ముప్పు ఉంటుంది. నిల్వ ఉంచిన ఫుడ్‌ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. హెపటైటిస్సీ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వండిన ఫుడ్‌ను మళ్లీ హీట్‌ చేసి తింటే డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement