కొండా లక్ష్మణ్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

కొండా లక్ష్మణ్‌కు నివాళి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

కరీంనగర్‌: కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డులోని ఎన్టీ ఆర్‌ చౌరస్తా వద్ద ఉన్న కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి సోమవారం మేయర్‌ శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వా సాల రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం నివాళి అర్పించారు. మేయర్‌ మాట్లాడుతూ పదవుల కన్నా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప పోరాటయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అన్నారు. కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, మాసం గణేశ్‌, తేల్ల లక్ష్మి, దేవసాని సరస్వతి, వేముల కవిత, పడిశెట్టి లక్ష్మి, పద్మశాలి సంఘం నాయకులు అలసభద్రయ్య, గడ్డం శ్రీరాములు, పోలు సత్యనారాయణ, ఒడ్నాల రవీందర్‌, మార్త ప్రకాశ్‌ పాల్గొన్నారు.

మతిస్థిమితం లేని వృద్ధుడి వద్ద రూ.1.15 లక్షలు

కరీంనగర్‌క్రైం: మతిస్థిమితం కోల్పోయి కరీంనగర్‌ బస్టాండ్‌లో తిరుగుతున్న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన మాడిశెట్టి కిష్టయ్యను వన్‌టౌన్‌ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం వేకువజామున 3గంటలకు పెట్రోలింగ్‌ సిబ్బంది రాజ్‌కుమార్‌, భాస్కర్‌ బస్టాండ్‌లో వృద్ధుడిని గమనించారు. అతని సంచిలో రూ.1,15,500 నగదు ఉన్నట్లు గుర్తించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వృద్ధుడితో పాటు నగదును వారికి అప్పగించారు.

కేడీసీసీబీ పీఐసీగా ‘కొండూరు’ బాధ్యతలు

కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ (కేడీసీసీబీ) ఇన్‌చార్జి అధికారిగా కొండూరు రవీందర్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సుదీర్ఘ కాలం చైర్మన్‌గా సేవలందించగా కాంగ్రెస్‌ ప్రభుత్వం 2025 డిసెంబర్‌ 19న 598 జీవో జారీ చేసి కలెక్టర్‌ను పీఐసీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రవీందర్‌రావు మాట్లాడుతూ, జీవో నంబర్‌ 598ను నిలిపివేసిన తదుపరి హైకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు డీసీవో తక్షణ చర్యలు తీసుకోవాలని జూన్‌ 12, 2026న ఉత్తర్వులు వచ్చాయని కానీ డీసీవో సదరు విషయాన్ని తెలుపలేదని అన్నారు. కోర్టు ఆదేశాల క్రమంలోనే పీఐసీగా బాధ్యతలు చేపట్టానని వివరించారు. గత 6నెలల కాలంలో బ్యాంకు వ్యాపారం రూ.50కోట్లకు పైగా తగ్గిందని వివరించారు. బ్యాంకులో విద్య, గృహరుణాలకు సంబంధించిన అనేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.

వార్డు మెంబర్ల చలో హైదరాబాద్‌

కరీంనగర్‌ టౌన్‌: వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ కరీంనగర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ‘హలో వార్డు మెంబర్స్‌.. చలో హైదరాబాద్‌’ పోస్టర్‌ను వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్‌గౌడ్‌ ఆవిష్కరించారు. వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, అకాల మరణానికి రూ.10 లక్షల పరిహారం, శిలాఫలకాలపై పేర్ల నమోదు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుముల నవీన్‌ కుమార్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల సాంబయ్యగౌడ్‌, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కామెర తిరుమల, సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు గంగాధర గంగజమున, జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు ఆకుల శ్రీదేవి, రాష్ట్ర గౌరవ సలహాదారు గడప కోటేశ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement