ఆలకించి.. పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించి.. పరిష్కరించండి

Sep 22 2026 12:30 AM | Updated on Sep 22 2026 12:30 AM

ఆలకించి.. పరిష్కరించండి ● ప్రజావాణిలో సమస్యల నివేదనలు ● పరిష్కరించాలని వేడుకోలు తిండి పెట్టడం లేదు

కరీంనగర్‌ అర్బన్‌: ఓ వైపు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ ప్రోగ్రాం పేరిట సర్కారుబడి విద్యార్థులకు టిఫిన్‌ సరఫరాకు చర్యలు చేపడుతుంటే రీజినల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిని సమస్యల అర్జీలు చుట్టుముట్టాయి. కలెక్టర్‌ చిత్రా మిశ్రా అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. అదనపు కలెక్టర్లు డి.శ్రీనివాస్‌రెడ్డి, అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో షర్మిల పాల్గొన్నారు. మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు.

మొత్తం అర్జీలు: 145, హౌజింగ్‌: 37

కరీంనగర్‌ కార్పొరేషన్‌: 32, వారధి: 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement