యోగా చాంపియన్‌ కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

యోగా చాంపియన్‌ కరీంనగర్‌

Sep 13 2026 12:12 AM | Updated on Sep 13 2026 12:12 AM

● 17వ సారి టైటిల్‌ కై వసం ● రన్నరప్‌గా రంగారెడ్డి, మేడ్చల్‌ ● మూడోస్థానంలో నిజామాబాద్‌ ● ముగిసిన రాష్ట్రస్థాయి యోగా పోటీలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌/కొత్తపల్లి: కరీంనగర్‌ కొత్తపల్లిలో ని అల్ఫోర్స్‌ ఈ టెక్నో పాఠశాలలో జరుగుతున్న 13వ రాష్ట్రస్థాయి యోగా పోటీలు శనివారంతో ము గిశాయి. కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులు మొత్తంగా 43 పాయింట్లు సాధించి వరుసగా 17వ సారి ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కై వసం చేసుకున్నారు. తలో 17 పాయింట్లతో రంగారెడ్డి, మేడ్చల్‌ ద్వితీయస్థానం, 11 పాయింట్లతో నిజామాబాద్‌ మూడోస్థానంలో నిలిచాయి. పోటీల్లో రాణించిన క్రీడాకారులను అక్టోబర్‌ 3 నుంచి జైపూర్‌లో జరిగే జాతీయ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలంగాణ యోగా సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపా రు. విజేతలకు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి ట్రోపీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే డిసెంబరులో తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో యోగా క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించి రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ యోగా అసోసియేషన్‌ చైర్మన్‌ రవీందర్‌సింగ్‌ మాట్లాడుతూ యోగాకు కరీంనగర్‌ చిరునామాగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.సిద్ధారెడ్డి మాట్లాడుతూ వరుసగా 17వసారి కరీంనగర్‌ చాంపియన్‌గా నిలవడం ఇక్కడి క్రీడా ప్రతిభకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కన్నకృష్ణ, కమలాకర్‌, గుంటి రామకృష్ణ, మనోజ్‌, స్వరూపాచారి, గంగాధర్‌, కిష్టయ్య, మల్లీశ్వరీ, ఆనంద్‌ కిశోర్‌, సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement