పర్యవేక్షణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ చేయాలి

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

పర్యవేక్షణ చేయాలి ప్రజలపై భారం

స్టాంప్‌ పేపర్‌ నుంచి నోటరీ వరకు ఒక్కోచోట ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. ఎంత చెల్లించాలో తెలియక అడిగినంతా ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల సామాన్యులపై అదనపు భారం పడుతోంది. నిర్ణీత రుసుములు స్పష్టంగా ప్రకటించడంతో పాటు, అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి.

– గిన్నారపు మహేందర్‌, బీఎస్పీ, నియోజకవర్గ అధ్యక్షుడు, హుజూరాబాద్‌

స్టాంప్‌ పేపర్లను అధిక ధరలకు విక్రయించడం వల్ల నిరుపేదలు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రూ.20 ఉండే స్టాంప్‌ పేపర్‌ను రూ.50కి, రూ.50 దాన్ని రూ.80కి, రూ.100 పేపర్‌ను రూ.150కి విక్రయించడం దారుణం. ప్రభుత్వం ప్రతీ పనికీ నోటరీ అడగడం వల్ల స్టాంప్‌ పేపర్ల ధరల భారాన్ని కూడా ప్రజలపై మోపడం సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధిక ధరల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలి. – కదిరి రమేశ్‌,

సీఐటీయూ మండల కార్యదర్శి, హుజూరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement