తిమ్మాపూర్: లోయర్ మా నేరు జలాశయంలో ప్రమాదవశాత్తు నీటమునిగి పురోహితుడు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లికి చెందిన సింహాచలం అన్విత్ (20) బెంగళూరులో పురోహితుడిగా పనిచేస్తూ జీవనంసాగిస్తున్నాడు. ఇటీవలె స్వగ్రామానికి వచ్చిన ఆయన స్నేహితులతో కలిసి సరదాగా మానేరు పరిసరాలలో గడిపేందుకు సోమవారం సాయంత్రం వచ్చారు. ప్రాజెక్టు నీటిలోకి దిగి అటూ ఇటూ తిరుగుతూ నీటమునిగాడు. సమచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలించగా నీటిలో మృతదేహం లభ్యమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు.


