కరీంనగర్‌స్పోర్ట్స్: హన్మకొండలో జరిగిన 12వ సౌత్ జోన్, రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారని అథ్లెటిక్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, సుమన్ కల్యాణ్ తెలిపారు. రణధీర్ 5వేల కిలో మీటర్ల వాక్‌లో, సిరి ట్రయథ్లాన్‌లో బంగారు, అరుణ్ కుమార్ 5వేల కిలో మీటర్ల వాక్‌లో, అభిరామ్ లాంగ్ జంప్‌లో రజత, రౌతు అభిషేక్ లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. క్రీడాకారులను సోమవారం స్వరాజ్ ట్రాక్టర్స్, వెంకట్ ఆటోమోటివ్స్ అధినేత గంప వెంకట్ అభినందించారు. రిటైర్డ్ పీడీ రాజగోపాల్ చారి పాల్గొన్నారు.


