గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలో మొదటిషిఫ్టులో గని పైకప్పు కూలి కోల్‌కట్టర్ కార్మికుడు సార్ల సాగర్ గాయపడ్డాడు. గనిలోని 50వ లెవల్, 13వ డీప్, 3వ సీమ్‌లో పైకప్పు సేఫ్టీ పనిచేస్తున్న క్రమంలో పెద్దబండ కూలి కొంతబాగం నడుం, కాళ్లపై పడటంతో కుడికాలుకు గాయాలయ్యాయి. వెంటనే సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ రాంమూర్తి కార్మికుడిని పరామర్శించారు.


