అక్షర దీపం వెలిగింది | - | Sakshi
Sakshi News home page

అక్షర దీపం వెలిగింది

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

● జగ్గారావు‘పల్లె’ చదివింది ● వయో‘జనులకు’ రాత్రి బడి చదువులు ● పోలీసుల ప్రోత్సాహం.. పల్లెజనం ఉత్సాహం ● ‘ప్రేరణ’తో చదువుల బాట ● నేడు అక్షరాస్యత దినోత్సవం

● జగ్గారావు‘పల్లె’ చదివింది ● వయో‘జనులకు’ రాత్రి బడి చదువులు ● పోలీసుల ప్రోత్సాహం.. పల్లెజనం ఉత్సాహం ● ‘ప్రేరణ’తో చదువుల బాట ● నేడు అక్షరాస్యత దినోత్సవం

సిరిసిల్ల: ఆ పల్లెలో అక్షర దీపం వెలిగింది. చైతన్య కాంతులు పల్లవించాయి. నాకెందుకు లే.. చదువు అటూ మొదట్లో ముక్కు విరిచినా వృద్ధులే.. పలకా, బలపం పట్టి అక్షరాలు దిద్దారు. వేలిముద్రలు వేసేవాళ్లంతా సంతకాలు నేర్చుకున్నారు. అంకెలు నేర్చుకొని ఫోన్‌ నంబర్లు రాస్తున్నారు.. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలోని జగ్గరావుపల్లి సాధించిన అక్షర విజయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షర పథకాలకు కోట్లు వెచ్చించినా.. ఆచరణలో సాధ్యం కాని పనిని స్థానిక పోలీసులు పన్నెండేళ్ల కిందట సాధించారు. సిరిసిల్ల అప్పటి డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌ ప్రేరణతో గ్రామస్తులు అక్షరాలు దిద్దారు. 2014లో మూడు నెలల్లోనే ఆ పల్లె ప్రజలు సంతకాల సాక్షిగా అక్షరాస్యులుగా మారారు. సెప్టెంబరు 8న అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

చిన్న ఊరు.. పెద్ద విజయం

జగ్గారావుపల్లిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా మార్చేందుకు పోలీసులు నడుం బిగించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, అప్పటి సిరిసిల్ల టౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌ ఆ ఊరిని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్తులతో మాట్లాడి రాత్రి బడి నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే చదువు విలువను అర్థమయ్యేలా వివరించేందుకు ప్రేరణ పేరుతో జానపద కళాకారులతో సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చదువురాని వారిని గుర్తించేందుకు సర్వే చేశారు. ఊరిలో జనాభా 1050 ఉండగా.. చదువు రాని వారు 154 మంది ఉన్నట్లు గుర్తించారు. రాత్రి బడి ఏర్పాటు చేశారు. ఐదుగురు నిరక్షరాస్యులకు ఒక్కో విద్యావంతుడికి అక్షరాలు దిద్దించే బాధ్యత అప్పగించారు. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు రాత్రి బడిలో అక్షరాలు దిద్దించారు. 2014 సెప్టెంబర్‌ 5న సంపూర్ణ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా మూడునెలల వ్యవధిలో జగ్గారావుపల్లిలోని 154 మందికి అక్షరాలు నేర్పించారు. సంతకాలు చేయడం రావడంతో అంకెలు నేర్చుకున్నారు. సెల్‌ఫోన్‌ నంబర్‌ రాయడం మొదలుపెట్టారు. రాత్రి బడి ఆ పల్లెలో అక్షర వెలుగులు నింపింది.

‘ఈచ్‌ వన్‌.. టీచ్‌వన్‌’ ఫెయిల్‌

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం ‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’ పేరుతో 2020లో సర్వే చేసింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు 260 గ్రామాల్లో 49,977 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో పురుషులు 13,400, మహిళలు 36,577 మంది ఉన్నారు. జిల్లాలో అక్షరాస్యుల సంఖ్య 3,15,611 మంది ఉన్నట్లు 2011 జనాభా లెక్కల ప్రకారం వెల్లడైంది. ఇందులో పురుషులు 1,82,946, మహిళలు 1,32,665 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యులు 2,36,706 మంది ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 78,905 మంది ఉన్నట్లు తేలింది. చదువు రాని వారికి చదువు నేర్పే లక్ష్యంతో ‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాలను భాగస్వాములను చేశారు. కానీ ఈ కార్యక్రమం అనేక కారణాలతో ఫెయిల్‌ అయింది. అయితే పోలీసుల చొరవతో జగ్గారావుపల్లి అక్షరాలు దిద్దింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement