కరీంనగర్‌కల్చరల్: సద్గురు శ్రీశబరీమాతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ పాతబజారులోని శ్రీ గౌరీశంకర ఆలయంలో 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అఖండ భగవన్నామ సంకీర్తన నిర్వహించారు. శనివా రం ఉదయం ప్రారంభమైన సంకీర్తన ఆదివా రం మధ్యాహ్నం వరకు కొనసాగింది. పురా ణం మహేశ్వరశర్మ, పరబ్రహ్మానందస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భజన బృందాలు 24 గంటల పాటు నిర్వీరామంగా భగవన్నామ సంకీర్తనలు ఆలపించాయి. ఈవో వెంకన్న, సమితి సభ్యులు పాల్గొన్నారు.
వైరాగ్యంకు సత్కారం
కరీంనగర్ కల్చరల్: జిల్లాకు చెందిన కవి, రచయిత, విమర్శకుడు, శతాధిక గ్రంథ ప్రచురణకర్త, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వైరాగ్యం ప్రభాకర్‌ను ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆదివారం ఘనంగా సన్మానించారు. డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో విశ్వనాథ సత్యనారాయణ జాతీయ పురస్కారంతో సత్కరించారు. కొత్త కవులను ప్రోత్సహిస్తూ 80కి పైగా సంకలనాలను వెలువరించినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముప్పవరపు లీలా కృష్ణ మోహన్ తెలిపారు. ముఖ్య అతిథి సాధనాల వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.
‘సమరభేరి’ సక్సెస్‌తో బీజేపీకి గుబులు
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యార్థి, యువ సమరభేరి’ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయిందంటూ మేయర్ కొలగాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న సభను అట్టర్ ఫ్లాప్ అని చెప్పడం బీజేపీ నాయకుల భయాన్ని, అసహనాన్ని బయటపెడుతోందని విమర్శించారు. యువత, విద్యార్థులతో కేటీఆర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలపై భరోసా కల్పించారన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మే యర్ ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రస్తుతం బీజేపీ నాయకులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని సింగ్ విమర్శించారు. నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన యువ సమరభేరి అట్టర్‌ఫ్లాప్ అయిందని కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎప్పుడో బర్త్‌రఫ్ చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికా రంలో ఉన్నప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులను పట్టించుకోకుండా, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కేటీఆర్‌కు నిజంగా దమ్ముంటే తన తండ్రి కేసీఆర్‌తో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. ఆ పదవిని బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేకు ఇవ్వాలని సూచించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పడం మాత్రమే కాకుండా, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని చెప్పే నైతిక ధైర్యం కేటీఆర్ చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుంటే బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.గౌతమినగర్ ఫీడర్ పరిధిలోని పిజి కళాశాల, మహాలక్ష్మీనగర్, శ్రీనివాసనగర్, వినాయకనగర్, జయశంకర్ కాలనీ, ముదిరా జ్ కాలనీ, కట్టరాంపూర్ ప్రాంతాలతో పాటు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, సప్తగిరిహిల్స్ రోడ్ నంబర్ 1,2,3, 4,5, తాహెర మజీద్, సంతోషిమాత ఆలయం, శ్రీనగర్‌కాలనీ, భవానీనగర్, మల్లికార్జునకాలనీ, జానకీ వీధి, లక్ష్మీగణపతి కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.


