పంచ్‌ కొడితే.. పతకమే | - | Sakshi
Sakshi News home page

పంచ్‌ కొడితే.. పతకమే

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

కరీంనగర్‌స్పోర్ట్స్‌: జిల్లా స్పోర్ట్స్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తొలి చాంపియన్‌షిప్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. సు మారు 400మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను అ ల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి, డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జానార్దన్‌రెడ్డి ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలన్నారు. తైక్వాండో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుతాయన్నారు. జిల్లా స్పోర్ట్స్‌ తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు మద్దుల గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బుర్ర ప్రవీణ్‌ కుమార్‌, కోశాధికారి సి.శరత్‌, కృష్ణచైతన్య, అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement