స్వర్ణోత్సవ సంబురం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవ సంబురం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

● 52ఏళ్లకు ఒక్కచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు

చిగురుమామిడి: సుమారు 52ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. ఆరు పదుల వయసులో తమ బాల్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్నారు. కాసేపు చిన్నపిల్లలుగా మారి.. సరదాగా ముచ్చటించారు. చదువుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ.. రోజంతా సంతోషంగా గడిపారు. ఇందుకు చిగురుమామిడి మండలం రేకొండలోని ప్రభుత్వ జెడ్పీపాఠశాల వేదికై ంది. 1973–74వ సంవత్సరంలో పాఠశాలలో పదోతరగతి పూర్తిచేసినవారు ఫోన్లు, వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఒకే వేదికపై ఆదివారం కలుసుకున్నారు. చదువుకున్న పాఠశాల నీడన చేరి, ఆనాటి రోజులను గుర్తుచేసుకుని కాసేపు ముచ్చటించారు. విద్యనేర్పిన గురువులను సత్కరించారు. ఐరెడ్డి భాస్కర్‌రెడ్డి పాఠశాల అభివృద్ధికి రూ.50 ఇస్తానని ప్రకటించారు. సర్పంచ్‌ అల్లెపు సంపత్‌, ఉపసర్పంచ్‌ చాడ సంతోష్‌రెడ్డి, బిల్లా జయ్‌పాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వీరయ్య, వెంకటాద్రి, కొమురయ్య, అనంతరెడ్డి, శ్రీనివాస్‌, రవీందర్‌, వెంకటగిరి, కనకాచారిక, పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement