రుణమాఫీ అమలు చేసేలా ఆదేశించండి | - | Sakshi
Sakshi News home page

రుణమాఫీ అమలు చేసేలా ఆదేశించండి

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

● హైకోర్టును ఆశ్రయించిన మానకొండూరు రైతులు ● రెండు వారాల్లోగా స్పందించాలంటూ వ్యవసాయశాఖకు ఆదేశాలు వసతుల పనులు పూర్తి చేయాలి ● టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలిసి పనిచేస్తాం ● శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్‌

● హైకోర్టును ఆశ్రయించిన మానకొండూరు రైతులు ● రెండు వారాల్లోగా స్పందించాలంటూ వ్యవసాయశాఖకు ఆదేశాలు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: వ్యవసాయం కోసం తీసుకున్న రుణమాఫీని అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన పెట్టం సదయ్య, ఏకుల శ్రీనివాస్‌ రైతులు రూ.2 లక్షలపైగా రుణం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ అమలైన సమయంలో వీరికి మాఫీ కాలేదు. దీంతో తమకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ సదరు రైతులు జూలైలో జిల్లా వ్యవసాయాశాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని జిల్లా వ్యవసాయశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కొన్నిరోజులు ఎదురుచూసినా.. న్యాయం జరగకపోవడంతో బాధితులు హైకోర్టులో జూలై 29న మాండమస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు రెండు వారాల్లోపు సంబంధిత రైతుల విషయాన్ని పరిశీలించి, స్పందించాలని జిల్లా వ్యవసాయశాఖను ఆదేశించింది.

కొత్తపల్లి(కరీంనగర్‌): విద్యుత్‌ మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ సర్కిల్‌లో గురువారం పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో నిర్మాణంలో ఉన్న నూతన ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పురో గతిపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశా రు. వాటర్‌ వర్క్స్‌ సబ్‌ స్టేషన్‌ను సందర్శించి.. అక్కడ ఏర్పాటు చేస్తున్న సౌర విద్యుత్‌ ప్లాంట్‌ పనులను పరిశీలించారు. అంతకుముందు హుజూరాబాద్‌లో నిర్మించనున్న డివిజన్‌ కార్యాలయ స్థలాన్ని చూశారు. అవసరమైన అనుమతులు మంజూరు చేసి నిర్మాణ పనుల ను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కరీంనగర్‌ సర్కిల్‌ ఎస్‌ఈ(ఆపరేషన్స్‌) రవీందర్‌, డీఈ రాజం, డీఈ(కన్స్‌ట్రక్షన్‌) చంద్రమౌళి, ఈఈ సివిల్‌ శ్రీనివాస్‌, ఇతర అధికారులు పనుల పురోగతిని సీఎండీకి వివరించారు.

కరీంనగర్‌ సిటీ: శాతవాహన వర్సిటీలో జాతీయ సేవాపథకం ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య యు.ఉమేశ్‌కుమార్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, విద్యార్థులు సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించాలని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం విశ్వవిద్యాలయం రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే శాతవాహనలో దాదాపు 350 సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య పి.సతీశ్‌కుమార్‌, జాతీయ సేవాపథకం సమన్వయకర్త ఇ.మనోహర్‌, పరీక్షల నియంత్రణాధికారి సురేశ్‌కుమార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కిశోర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

క్వింటాల్‌ పత్తి

రూ.9,000

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.9,000 పలికింది. గురువారం మార్కెట్‌కు 2 వాహనాల్లో 16 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురాగా.. క్వింటాల్‌కు మోడల్‌ ధర రూ.8,800, కనిష్ట ధర రూ.8,400కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయవిక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement