సప్తగిరికాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఎంపికల్లో బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బార్‌బెల్‌ను పైకెత్తుతూ ఆత్మవిశ్వాసాన్ని చాటిన చిన్నారుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సాధించిన బంగారు స్ఫూర్తితో వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు కనిపించారు. చేతుల్లో బరువు పెరుగుతున్న కొద్దీ.. వారి కల నెరవేరుతుందన్న సంకల్పంతో వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతున్నారు. అర్చన 70 కిలోలు, శ్రీజ 60 కిలోల బరువెత్తి రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.
– కరీంనగర్‌స్పోర్ట్స్


