● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌కల్చరల్‌: బంజారా సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించే విశిష్టమైన పండుగ తీజ్‌ అని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అన్నారు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌, చింతకుంట ప్రాంతాల్లో తీజ్‌ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం హాజరై మాట్లాడారు. తీజ్‌ పండుగ తెలంగాణ విశిష్ట సంస్కృతికి అద్దం పడుతుందని కొనియాడారు. సంప్రదాయబద్ధంగా గోధుమ మొలకల(నారు) పందిరి వద్ద కొబ్బరికాయ కొట్టి.. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లంబాడీ మహిళలతో కలిసి నృత్యాలు చేస్తూ.. ఆడిపాడి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ మాసం గణేశ్‌, 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ గడ్డి ప్రదీప్‌, 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ పిట్టల సాయిజ్యోతి, కార్పొరేటర్లు తోట అనిల్‌, కేఏపీపీ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్‌, బండ రమణారెడ్డి, గాజ శివరాం, దేవసాని సత్యనారాయణ, కర్రె అనిల్‌, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement