తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన రామంచ లచ్చయ్య (58) తీవ్రమైన ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అంతటి పెద్ద మొత్తంలో వైద్యఖర్చులు భరించే శక్తి లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్య ప్రాణాలను నిలిపేందుకు గ్రామస్తులు, దాతలు, యువత, స్వచ్ఛంద సంస్థలు ఉదారంగా స్పందించి, ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. లచ్చయ్య కొడుకు శోభన్‌బాబును 96033 84576లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.
మంచానికి పరిమితమైన లచ్చయ్య


