రామగుండంలో నూతన ట్రాక్షన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ | - | Sakshi
Sakshi News home page

రామగుండంలో నూతన ట్రాక్షన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

రామగుండం: రామగుండం–మణుగూర్‌ నూతన రైల్వే ప్రాజెక్టు, పూర్తిస్థాయి వినియోగంలోకి మూడో రైల్వే లైన్‌, పెరిగిన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, వివిధ పరిశ్రమలకు పెరిగిన గూడ్సు ఎగుమతులు నేపథ్యంలో విద్యుత్‌ వినియోగ సామర్థ్యం పెంచుకునేందుకు రామగుండం రైల్వేస్టేషన్‌ ప్రధాన రైల్వేలైన్‌ పక్కనే ట్రాక్షన్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగా టీఎస్‌ఎస్‌ నిర్మాణానికి అంచనా వ్యయం రూ.8.46 కోట్ల నిధులు కేంద్రం కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీనిని టీజీ ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ప్రాజెక్ట్సు–2 ఉన్నతాధికారి పర్యవేక్షణ చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement