జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్:
అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించి, వివిధశాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
సంక్షేమ పథకాల అమలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో మహిళలు, బాలికలు 8.03 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా రూ.366.31 కోట్ల లబ్ధి పొందారన్నా రు. రూ.500కే గ్యాస్ పథకంలో 1.58 లక్షల మందికి 9,23, 755 సిలిండర్లు సరఫరా చేసి రూ.29.78 కోట్ల సబ్సిడీ చెల్లించామన్నారు. గృహజ్యోతి కింద 1,71,622 సర్వీసులకు రూ.182.30 కోట్ల జీరో బిల్లులు జారీ చేశామన్నారు. వానా కాలంసాగుకు 1,92,628మంది రైతుల ఖాతాల్లో రూ.206. 82 కోట్ల రైతుభరోసా జమ చేశామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు.. పింఛన్లు
జిల్లాకు తొలి విడతలో 10,506 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 8,557 నిర్మాణంలో ఉన్నాయన్నారు. రూ.222 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1,500 ఇళ్లు, పైకప్పుల మార్పునకు 500మందికి రూ.2లక్షల చొప్పున సాయం అందించనున్నామన్నారు. 1,32,229 మందికి నెలకు రూ.30.60 కోట్ల పింఛన్లు అందుతుండగా కొత్తవారికి పింఛన్లు మంజూరు ప్రక్రి య ప్రారంభమైందన్నారు. 47,138 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి 97,013 కుటుంబ సభ్యుల పేర్లు చేర్చామ ని, 3,22,198 కుటుంబాలకు నెలకు 6,063 మెట్రిక్ టన్ను ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా జనవరి నుంచి 14,932 మందికి శస్త్రచికిత్సలు చేయి ంచి ఆస్పత్రులకు రూ.42.75 కోట్లు చెల్లించామన్నారు.
మహిళా శక్తి
ఇందిరా మహిళా శక్తి కింద 93 యూనిట్లకు రూ.2.65 కోట్లు మంజూరు చేశామన్నారు. 175 మహిళా సంఘాలకు రూ.26 కోట్ల బ్యాంకు లింకేజీ, గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 1,706 సంఘాలకు రూ.165.74 కోట్ల రుణాలు అందించామన్నారు. 374 మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, కరీంనగర్ అర్బన్, గంగాధరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజాపాలన.. భూభారతి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 4,290 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించామన్నారు. అన్ని గ్రామాల్లో 15 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టగా కోనేరుపల్లి, వెలిచాల ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా గుర్తింపు పొందాయన్నారు. ఈ ఏడాది 2.20 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమైందని, 16 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గత యాసంగిలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు.
విద్య.. వైద్యం
చొప్పదండిలో రూ.37 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. మానకొండూరులో రూ.17.5 కోట్లతో 30 పడకల సామాజిక వైద్యశాల నిర్మాణంలో ఉందన్నారు. కొత్తపల్లిలో రూ.15 కోట్లతో ఆయుష్ ఆస్పత్రి నిర్మించనున్నామన్నారు. కొత్తపల్లి మెడికల్ కళాశాలలో రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల భవనం తుది దశకు చేరిందన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో రూ.2.98 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్సులు, వైద్య పరికరాలు సమకూర్చామని తెలిపారు. చొప్పదండి, మానకొండూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో 5,351మంది మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధికి రూ.50 లక్షలు విడుదల చేశామన్నారు.
మహిళలు.. బాలల సంక్షేమం
777 అంగన్‌వాడీల ద్వారా 7,579 మంది గర్భిణులు, బా లింతలు, 42,909 మంది చిన్నారులకు పోషకాహార అందుతోందన్నారు. జిల్లాలో 60 అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో 151 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామన్నారు. దివ్యాంగులకు 132 సహాయ ఉపకరణాలు, దివ్యాంగులను వివాహం చేసుకున్న 17 జంటలకు బహుమతులు ఇచ్చామని తెలిపారు.
నగరాభివృద్ధి.. జనగణన
కరీంనగర్‌లో రూ.840 కోట్ల యూసీఎ ఫ్, రూ.50 కోట్ల యూఐడీఎఫ్, రూ. 158 కోట్ల సాధారణ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలి పారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రుఫుల్ దేశాయ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
సాంస్కృతిక ప్రదర్శనలు
కరీంనగర్ కల్చరల్: పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ‘పాడవోయి భారతీయుడా’ పాటకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. కేజీబీవీ తిమ్మాపూర్ విద్యార్థులు ‘భారత్ మాతా’ పాటకు చేసిన నృత్యం ఆకట్టుకుంది. మహాత్మజ్యోతిభా పూలే కరీంనగర్ విద్యార్థులు ‘కాబ్ నై హై జీషన్ భారత్’ పాటకు ప్రదర్శన ఇచ్చారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ చొప్పదండి విద్యార్థులు ‘జయతి జయతి భారతం’ గీతానికి చేసిన నృత్యం అలరించింది. పారమిత విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.


