కరీంనగర్ కార్పొరేషన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. శనివారం నగరపాలకసంస్థ 7వ డివిజన్ హౌసింగ్‌బోర్డుకాలనీలోని మినీస్టేడియం ఆవరణలో బ్లాక్‌ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరపాలకసంస్థ విస్తృతస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హౌసింగ్‌బోర్డుకాలనీ మైదానంలో దాదాపు 200 వరకు మొక్కలు నాటడం జరిగిందని వెల్లడించారు. నాటిని మొక్కలు సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాలనీ వాసుల విన్నపం మేరకు సింథటిక్‌వాకింగ్‌ట్రాక్, ఓపెన్‌జిమ్, బోర్‌వెల్ మోటారు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, అదనపు కమిషనర్ సువార్త, కాలనీ వాసులు పెందోట చారి, గర్రెపల్లి సత్యనారాయణరావు, జాజాల మోహన్‌రావు, తోట సాగర్, వాడె వెంకటరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మినారాయణ,నల్ల గణపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


