కరీంనగర్‌టౌన్: వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవా లని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. శుక్రవారం రాత్రి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి ఓపెన్ స్కూల్ విధానం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు. విద్యాభ్యాసానికి వయసు, పరిస్థితులు అడ్డంకి కాకూడదని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉన్నత విద్యకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఈవో చైతన్య జైనీ, కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ పాల్గొన్నారు.


