ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట గ్రామం ఆర్మీ జవాన్లకు కేరాఫ్‌గా నిలుస్తోంది. 1948లో మొదటిసారిగా ఇల్లంతకుంట నుంచి జెట్టిపోచయ్య సైన్యంలో చేరారు.మహమ్మద్ జైనుద్దీన్ సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి 1985 నుంచి ఆర్మీలో సేవలందించారు. రిటైర్డ్ అయిన తర్వాత రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వీరే కాకుండా బండారి అజయ్, అనిల్, అంతటి అనిల్, గడ్డమీద శ్రీకాంత్, డి.శశి కుమార్, కూనబోయిన పరశురాం, బైరి అనిల్ కుమార్, ఓదెల శివ, ఆనంద్ సైన్యంలో సేవలందిస్తున్నారు.


